![]() |
![]() |

సినీ నటి కరాటే కళ్యాణి గురించి అందరికీ తెలుసు. ఎన్నో మూవీస్ లో బోల్డ్ క్యారెక్టర్స్ లో నటించారు. ఆమె యాక్చ్యువల్ గా హరికథ కళాకారిణి...పాటలు కూడా పాడుతుంది. అంతే కాదు కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ కూడా. సుదీర్ఘ కాలం పాటు హరికథ చెప్పినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించుకుంది. ఐతే ఇటీవలి కాలంలో ఈమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.
ఇక ఇప్పుడు ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇది చూస్తే కరాటే కల్యాణి గాత్రం ఇంత బాగుందా అని అనిపించక మానదు. కరాటే మాత్రమే కాదు తనలో మరో యాంగిల్ కూడా ఉందని నిరూపించింది. ఆమె తన గురువు దగ్గర భక్తి గీతాలను తన్మయత్వంతో ఆలపిస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోతో పాటు ఒక పోస్ట్ కూడా పెట్టింది. " గురువు గారి వద్ద చాలా రోజులకు గొంతు సవరించుకుని నేర్చుకుంటే చిన్నపిల్లనైపోయాను.. ధన్యవాదాలు గురువుగారు...మా మాస్టారు కేవీ బ్రహ్మానందంగారు..ఆయన సినీనటి జయప్రద గారికి కూడా సంగీతం నేర్పిన గురువు... మా ఇంటికి విచ్చేసి నాకు మంచి గీతాలను నేర్పించారు.. ధన్యవాదాలు మరొక్కసారి గురువుగారు శ్రీ గురుబ్యోనమః " అని పెట్టింది.
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కరాటే కళ్యాణి ఓ వెలుగు వెలిగింది. ఈమె ఎక్కువగా వ్యాంప్ రోల్స్ కి పెట్టింది పేరు. ఆ డైలాగ్స్ ని ఆమె తప్ప ఎవరూ చెప్పలేరేమో అనిపిస్తోంది. ఐతే ఇలాంటి పాత్రల్లో నటించడం వలన తనపై వ్యభిచారిణి అనే ముద్ర పడింది..అది చాలా బాధ కలిగిస్తోంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
![]() |
![]() |